సత్యం, అహింసతోనే ప్రపంచశాంతి సాధ్యం: బెర్న్ ఇ మేయర్ - gandhi 150 birthday celebrations in visakha
గాంధీజీ సిద్ధాంతాలైన సత్యం, అహింసతోనే ప్రపంచ శాంతి సాధ్యమని.... అమెరికన్ గాంధీగా గుర్తింపు పొందిన బెర్న్ ఇ మేయర్ ఉద్ఘాటించారు. మహాత్ముడి 150వ జయంతి వేడుకల సమయంలో భారతదేశంలో పర్యటించడం తనకెంతో ప్రత్యేకమన్నారు.

గాంధీజీ సిద్ధాంతాలైన సత్యం, అహింసతోనే ప్రపంచ శాంతి సాధ్యమని... అమెరికన్ గాంధీగా గుర్తింపు పొందిన బెర్న్ ఇ మేయర్ ఉద్ఘాటించారు. మహాత్ముడి 150వ జయంతి వేడుకల సమయంలో భారతదేశంలో పర్యటించడం తనకెంతో ప్రత్యేకమన్నారు. గాంధీజీ వేషధారణలో అమెరికా, కెనడా, ఇంగ్లండ్‌లలోనే కాకుండా మన దేశంలోనూ బాపూజీ సిద్ధాంతాలను ప్రచారం చేస్తున్న ఆయన... విశాఖలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో పర్యటించారు. భారతదేశమన్నా, భగవద్గీత అన్నా తనకెంతో ఇష్టమని చెప్పిన ఆయన మరెన్నో విషయాలను ఈటీవీ భారత్తో పంచుకున్నారు.