నిత్యం అంతర్జాతీయ యుద్ధ జలాలలో సైనిక పాటవాన్ని ప్రదర్శించే అమెరికా (సెయిలర్స్) నౌకాదళ సభ్యులు... భారతీయ దివ్యాంగులతో జతకలిశారు. విశాఖ ప్రజ్వల్ వాణి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో దివ్యాంగులు.. వ్యర్థాలతో చేసిన కళారూపాలను తిలకించారు. పునర్వినియోగం కోసం చేస్తున్న కృషిలో భాగమయ్యారు. అమెరికా నౌకాదళానికి చెందిన 25 మంది నావికులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. భారతీయ సంస్కృతితో ఎంతో బాగుందని అమెరికా నావికులు కొనియాడారు. ఎందుకూ పనికిరాని వ్యర్థాలను కళారూపాలుగా, అలంకరణ సామాగ్రిగా రూపొందించేందుకు దివ్యాంగులతో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
దివ్యాంగులతో అమెరికా నావికులు సరదాగా కాసేపు! - disabled
అమెరికా నౌకా దళ సిబ్బంది.. విశాఖలో దివ్యాంగులను కలిశారు. వారు తయారు చేసిన పదార్థాలను పరిశీలించారు.
దివ్వాంగులతో అమెరికా నావికులు సరదాగా కాసేపు...