ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కొనసాగించాలి' - Ambedkar Vidyardhi Sangam Agitation

రాష్ట్రంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విద్యార్థి సంఘం విశాఖలో ఆందోళన చేపట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో వెనుకబడిన వర్గాల వారికి మెరుగైన విద్యను అందించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు.

Ambedkar Vidyardhi Sangam Agitation
అంబేద్కర్ విద్యార్థి సంఘం ఆందోళన

By

Published : Oct 19, 2020, 3:36 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విశాఖలో అంబేద్కర్ విద్యార్థి సంఘం ఆందోళన చేపట్టింది. డాబాగార్డెన్స్ లోని అంబేద్కర్​ విగ్రహం వద్ద ప్లకార్డులు పట్టుకుని పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. రెండు నుంచి ఎనిమిదవ తరగతి విద్యార్థులను కూడా ఈ పథకంలో చేర్చాలని కోరారు.

దళిత విద్యార్థులను విద్యకు దూరం చేసే ఉద్దేశ్యంతో వైకాపా ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, దళిత, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. పథకాన్ని యధావిధిగా కొనసాగించకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details