ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'బడుగుల అభ్యున్నతికి అంబేడ్కర్ చేసిన కృషి.. మరువలేనిది' - today Ambedkar Jayanti in visakhapatnam district news

విశాఖలో డా.బీఆర్ అంబేడ్కర్ జయంతిని ఘనంగా జరిపారు. వైకాపా పార్టీ కార్యాలయంలో అంబేడ్కర్ విగ్రహానికి ఎంపీ విజయ సాయిరెడ్డి పూల మాలలు వేసి నివాళులర్పించారు. జిల్లాలోని పలు చోట్ల అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి.. ఆయన చేసిన సేవలను కొనియాడారు.

Ambedkar Jayanti
విశాఖలో ఘనంగా అంబేద్కర్ జయంతి

By

Published : Apr 14, 2021, 5:16 PM IST

భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ బి.ఆర్.అంబేడ్కర్ 130వ జయంతి వేడుకలు విశాఖలో ఘనంగా జరిగాయి. వైకాపా పార్టీ కార్యాలయంలో అంబేడ్కర్ విగ్రహానికి ఎంపీ విజయ సాయిరెడ్డి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి అంజలి ఘటించారు. భూమి ఉన్నంత కాలం అంబేడ్కర్ భారత ప్రజలకు గుర్తుండిపోతారని ఎంపీ విజయ సాయిరెడ్డి అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్న ఆయన ఆశయ సాధనకు వైకాపా ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు చెప్పారు.

విశాఖ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యుడు గణబాబు డాక్టర్ అంబేడ్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాణానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు.

డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ..

ప్రపంచంలోని ప్రముఖ రాజ్యాంగాలను.. భారతీయుల ఆలోచనా విధానాలను నిశితంగా అధ్యయనం చేసి.. భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రచించారని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్. కుంభా రవిబాబు అన్నారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో విశాఖ డ్రెడ్జి హౌస్ లో అంబేడ్కర్ 130వ జయంతిని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన భారతీయ సమాజంలో అన్ని రకాల అణచివేత, అసమానతలు తొలగిస్తేనే అభివృద్ధి సాధ్యమని రాజ్యాంగ నిర్మాత గుర్తించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ముఖ్య కార్య నిర్వహణాధికారి ప్రదీప్ కుమార్, ఆచార్య జీవైవి విక్టర్ తదితరులు పాల్గొన్నారు.

పోర్టు ఛైర్మన్ నివాళి

భార‌త రాజ్యాంగ ర‌చనా సంఘం అధ్య‌క్షుడు, భార‌తర‌త్న డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్కర్ స‌మ‌ స‌మాజం కోసం ప‌రిత‌పించిన మ‌హ‌నీయుడ‌ని విశాఖ పోర్టు ఛైర్మ‌న్ కె. రామ్మోహ‌న‌రావు కొనియాడారు. జయంతి సందర్భంగా ఆయన నివాళులు అర్పించారు. ఆయ‌న ఆద‌ర్శాల‌ను ఆచ‌ర‌ణ‌లో పెట్టాల్సిన బాధ్య‌త‌, వాటికి క‌ట్టుబడి ఉండాల్సిన అవ‌స‌రం ఇప్ప‌టి పౌర సమాజం పై ఉంద‌న్నారు. పెద్ద సంఖ్య‌లో పోర్టు ఉద్యోగులు అంబేడ్కర్ విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి, నివాళులర్పించారు.

కాంగ్రెస్ ఆధ్వర్యంలో...

అంబేడ్కర్ ఆశయాల సాధనకు ప్రభుత్వాలు కృషి చేయాలని విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తాలూరి విజయ్ కుమార్ తెలిపారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని పేదలకు చీరలు పంపిణీ చేశారు. విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. రాజవారంలో ఎం.ఆర్.పీ.ఎస్ నాయకులు ఏడిద సురేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఇవీ చూడండి:

సబ్బుపై చెక్కిన ఉగాది కళాకృతి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details