అంబేడ్కర్ 129వ జయంతిని విశాఖలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఎల్ఐసీ భవనం వద్ద ఉన్న రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి మహా విశాఖ నగర పాలక సంస్థ కమిషనర్ సృజన పూలమాల వేసి నివాళులు అర్పించారు. వెనుకబడిన స్థాయి నుంచి ఉన్నత స్థానానికి ఎదిగిన అంబేడ్కర్ స్ఫూర్తిని మనం ముందు తరాలకు అందించాలని ఆమె కోరారు. అంబేద్కర్ తన జీవితంలో ఆచరించి చూపిన ఆశయాలను సమాజంలోని అన్ని వర్గాల వారు ఆకళింపు చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ ముఖ్య వైద్యాధికారి శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
'అంబేడ్కర్ ఆశయాలను అన్ని వర్గాల వారు ఆకళింపు చేసుకోవాలి' - lockdown in visakha
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 129వ జయంతిని విశాఖలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఎల్ఐసీ భవనం వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి మహా విశాఖ నగర పాలక సంస్థ కమిషనర్ సృజన పూలమాల వేసి నివాళులర్పించారు.
విశాఖలో అంబేద్కర్ 129వ జయంతి