విశాఖలో అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ కార్యాలయం! - Amaravati Metro Rail Corporation Regional Office to be set up in Vishakha
విశాఖలో అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నగరంలో త్వరలో లైట్ మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన పనులు చేపట్టాల్సి రావటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ ప్రాంతీయ కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇస్తూ పురపాలక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం విజయవాడలోని కేంద్ర కార్యాలయం నుంచే సేవలను అందిస్తున్నప్పటికీ విశాఖ నగరంలో త్వరలో లైట్ మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన పనులు చేపట్టాల్సి రావటంతో అక్కడ ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా సూచిస్తూ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖలో 79.91 కిలోమీటర్లు మేర లైట్ మెట్రోరైలు కారిడార్, 60 కిలోమీటర్ల మేర ట్రామ్ కారిడార్ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే డీపీఆర్‌ల రూపకల్పన కోసం అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ కోటేషన్లు పిలిచింది. ఈ పనుల పర్యవేక్షణ కోసం విశాఖలో ఏఎంఆర్సీ కార్యాలయం ఏర్పాటుకు అనుమతిస్తూ పురపాలక శాఖ ఈ ఆదేశాలు జారీ చేసింది.