Amaravati Capital : అమరావతి రైతు జేఏసీ నాయకుడు గద్దె తిరుపతిరావు అమరావతి రైతుల పాదయాత్ర విశాఖ జిల్లాలో కొనసాగుతోంది. భీమునిపట్నం నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర నిర్వహిస్తున్నారు. గతంలో అమరావతికి మద్దతుగా రైతులు పాదయాత్ర నిర్వహించగా, అనివార్య కారణాల వల్ల ఆపినట్లు ఆయన తెలిపారు. దానికి కొనసాగింపుగా ఇప్పుడు మళ్లీ గత పది రోజులుగా పాదయాత్రను నిర్వహిస్తున్నట్లు గద్దె తెలిపారు.
రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతే ఉండాలని అన్నారు. గత ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలతో కలిపి.. ఇప్పుడున్న వైసీపీతో కూడా అందరూ కలిసే.. అమరావతి రాజధానిగా నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా రాజధానిని మారుస్తారా అని ప్రశ్నించారు. వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అమరావతిపై వెచ్చించరాన్నారు.