ప్రభుత్వ రంగ పరిశ్రమలను కాపాడుకొనేందుకు దండి తరహాలో దేశంలో మరో విప్లవం రావాల్సిన అవసరం ఉందని సీనియర్ జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త తోట సురేశ్ విశాఖలో అభిప్రాయం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అమరావతి నుంచి విశాఖకు పాదయాత్ర చేసిన ఆయన.. జీవీఎంసీ గాంధీ పార్కులో మీడియాతో మాట్లాడారు. మోదీ సర్కారు ప్రైవేటీకరణకు మొగ్గు చూపుతోందని.. ప్రజలు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయం అర్థమయ్యేలా పెద్ద ఎత్తున ఉద్యమించాలని అన్నారు. సామాజిక మాద్యమాల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తెలిసేలా పోస్టులు పెట్టాలన్నారు. ప్రజలు ఈ సామాజిక ఉద్యమంలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
'విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి 'దండి' తరహా ఉద్యమం అవసరం' - అమరావతి నుంచి విశాఖ పాదయాత్ర తాజా వార్తలు
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను అడ్డుకోవాలంటే దండి తరహా ఉద్యమం అవసరమని సామాజిక కార్యకర్త తోట సురేశ్ అభిప్రాయపడ్డారు. అందుకోసం పెద్ద ఎత్తున ఉద్యమించాలన్నారు.
సీనియర్ జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త తోట పాదయాత్ర , విశాఖ స్టీల్ ప్లాంట్ తాజా వార్తలు