ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CELEBRATIONS: పాండ్రంగిలో ఘనంగా 'అల్లూరి' జయంతి వేడుకలు - విశాఖ జిల్లా తాజా వార్తలు

CELEBRATIONS: అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు ఆయన స్వగ్రామమైన పాండ్రంగిలో ఘనంగా జరిగాయి. అల్లూరి, ఆయన తల్లి సూర్యనారాయణమ్మ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అల్లూరి చరిత్ర స్ఫూర్తిదాయకమని వక్తలు ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

CELEBRATIONS
CELEBRATIONS

By

Published : Jul 5, 2022, 7:28 AM IST

CELEBRATIONS: అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ఆయన జన్మించిన విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం పాండ్రంగి గ్రామంలో సోమవారం ఘనంగా జరిగాయి. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కలెక్టర్‌ ఎ.మల్లికార్జున ముందుగా అల్లూరి, ఆయన తల్లి సూర్యనారాయణమ్మ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అల్లూరి చరిత్ర స్ఫూర్తిదాయకమని వక్తలు ఉద్బోధించారు. ఇక్కడికి వచ్చే సందర్శకులు రేకుల షెడ్డు, రంగు వెలిసిపోయిన అల్లూరి విగ్రహాన్ని చూసి నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారని, ప్రభుత్వం ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా సర్పంచి పల్లె ఝాన్సీ కోరారు. చారిత్రక నేపథ్యం గల ఈ గ్రామానికి చేరుకునేందుకు గోస్తనీనదిపై వంతెన నిర్మాణానికి రూ. 14 కోట్లతో 18 నెలల క్రితం శంకుస్థాపన చేసినా నేటికీ పనులు చేపట్టకపోవడాన్ని నిరసిస్తూ జనసేన భీమిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ పంచకర్ల సందీప్‌ తదితరులు రోడ్డుపై సాయంత్రం వరకు బైఠాయించి నిరసన దీక్ష చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details