విశాఖ జిల్లా పద్మనాభ మండలం పాండ్రంగిలో అల్లూరి సీతారామరాజు 122వ జయంతి వేడుకలు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. గిరిజన సంప్రదాయ నృత్యాలతో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. కొమ్ముకోయ, థింసా, తప్పుడు గుళ్ళు కోలాటం, డప్పు వాయిద్యాలు నడుమ గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. పర్యాటక శాఖ ఈ ఉత్సవాలకు 10 లక్షలు ప్రకటించింది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో గ్రామానికి మౌలిక వసతుల కల్పనకు రెండు కోట్లు ప్రకటించిందని మరికొద్ది రోజుల్లో పనులు ప్రారంభిస్తామని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు.
సభకు అల్లూరి వారసుల హాజరు...
సభలో అల్లూరి వారసులను మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఘనంగా సన్మానించారు. జయంతి వేడుకల్లో ప్రత్యక్షంగా పాల్గొనడం తమకెంతో ఆనందం కలిగిస్తోందని అల్లూరి వారసులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. మమ్మల్ని గుర్తు పెట్టుకొని మంత్రి అవంతి మా తాత గారు పుట్టిన స్థలంలో అడుగు పెట్టించడం ఆనందంగా ఉందని వారు తెలిపారు.