అన్ని వర్గాలను అలరించేలా జనసేన మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజలను అలరించేలా జనసేన మేనిఫెస్టో ఉందని ఆ పార్టీ అనకాపల్లి లోక్సభ నియోజకవర్గఅభ్యర్థి చింతల పార్థసారథి తెలిపారు. అనకాపల్లిలో ఆయన పరిచయ సమావేశం ఏర్పాటు చేశారు. ఆదాయపు పన్ను శాఖలో పనిచేస్తున్న తాను ముందస్తుగా పదవీ విరమణ చేసినట్టు చెప్పారు.పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి జనసేన పార్టీలో చేరానని వివరించారు. రాజమహేంద్రవరంలో పవన్ కళ్యాణ్ విడుదల చేసిన జనసేన మేనిఫెస్టో.. మహిళలు, రైతులు యువత.. ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఉందన్నారు.