విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తే.. ఒప్పకోమని విశాఖలో అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాలు హెచ్చరించాయి. ఉక్కు పరిశ్రమను దక్కించుకునేందుకు ప్రాణత్యాగానికైనా సిద్ధ పడతామని తెలిపారు. అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రభుత్వ రంగ పరిరక్షణ కమిటీ సంయుక్తంగా సీఐటీయూ కార్యాలయంలో స్టీల్ ప్లాంట్ భవిష్యత్ కార్యాచరణపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. ఈనెల 25 నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ప్రజా సంఘం నేతలు స్పష్టం చేశారు. క్విట్ ఇండియా డేగా పిలవబడే ఆగస్టు 9ను.. సేవ్ ఇండియా డే గా జరుపుకోవాలని నిర్ణయించారు.
All-party labor and public associations: క్విట్ ఇండియా డేను.. సేవ్ ఇండియా డేగా జరుపుకోవాలి - latest news im vishaka district
విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేస్తే.. ఒప్పకోమని అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాలు హెచ్చరించాయి. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. ఈనెల 25 నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు.
అఖిలపక్ష కార్మిక,ప్రజా సంఘాలు