విశాఖ సీపీఎం కార్యాలయంలో అఖిలపక్షం నేతలు సమావేశం నిర్వహించారు. ఎల్జీ పాలిమర్స్ సంస్థపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంపై సరైన కేసులు నమోదు చేయలేదని విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యుడు వాసుపల్లి గణేశ్ ఆరోపించారు.
ఎల్జీ పరిశ్రమకు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రజలకు జీవితాంతం ఆరోగ్య భద్రతను రాష్ట్ర ప్రభుత్వమే కలించాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్ నర్సింగరావు, పలువురు నేతలు పాల్గొన్నారు.