New Year 2023 Celebrations : నూతన సంవత్సర వేడుకలకు విశాఖ నగరం సిద్ధమైంది. కరోనా కారణంగా గత మూడు సంవత్సరాలలో కొత్త సంవత్సరం వేడుకలకు దూరంగా ఉన్న నగరవాసులు.. ఈ ఏడాది ఘనంగా నిర్వహించుకోవటానికి సిద్ధమయ్యారు. నూతన సంవత్సర వేడుకలలో ప్రజలు వినియోగించే కేకుల కోసం బేకరిలు, పూల దుకాణాలు, స్వీట్ల దుకాణాలు ఇలా అన్నీ సిద్ధమయ్యాయి. విశాఖ ప్రజలు కొత్త సంవత్సర వేడుకలను ప్రతియేటా ఘనంగా నిర్వహించుకుంటారు. మహిళలు, చిన్నారులు ఇలా చిన్న పెద్ద అందరూ విశాఖ బీచ్ రోడ్డుకు చేరుకుని.. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి వరకు సంబరాలు నిర్వహించుకుని నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు.
నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు సిద్ధమైన విశాఖ నగర వాసులు - ఈటీవీ తెలుగు వార్తలు
New Year 2023 Celebrations : విశాఖ ప్రజలు నూతన సంవత్సరానికి స్వాగతం చెప్పటానికి రెడీ అవుతున్నారు. ప్రజలు వినియోగించే పండ్ల, పూల దుకాణాదారులు దుకాణాలను సిద్ధం చేశారు.
![నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు సిద్ధమైన విశాఖ నగర వాసులు New Year 2023 Celebrations](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17361853-656-17361853-1672488232843.jpg)
నూతన సంవత్సరం
ఆంగ్ల నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు తెలుపుకోవటం, ఉత్సవాలు నిర్వహించుకోవటం ఆనవాయితీగా మారిందని నగర వాసులు అంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఉద్యోగులు, సిబ్బంది తమ కార్యాలయాలలో పనిచేసే వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఈ సమయంలో శుభాకాంక్షలు తెలియజేసిన తర్వాత పూలను, పండ్లను ఇవ్వటం ఆనవాయితీగా మారింది. దీంతో పూలబొకేలకు, పండ్లబొకేలకు డిమాండ్ పెరిగింది. ఈ ఏడాది పూల, పండ్ల రేట్లు ఆధికంగా ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు.
విశాఖలో నూతన సంవత్సర ఏర్పాట్లు
ఇవీ చదవండి: