విశాఖలో 52 రోజులుగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని దగ్ధం చేయడాన్ని అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ ఛైర్మన్ ఎం.జగ్గునాయుడు తీవ్రంగా ఖండించారు. జీవీఎంసీ వద్ద దీక్షా శిబిరాన్ని దగ్ధం చేసిన వారిని అరెస్టు చేసి దానిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తుకు ఆదేశించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ దీక్షా శిబిరాన్ని ఉద్దేశపూర్వకంగా దగ్ధం చేశారని ఐక్య వేదిక ఆరోపించింది. దానికి నిరసనగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
విశాఖ ఉక్కు దీక్ష శిబిరంలో మంటలపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించాలి: జేఏసీ - initiation camp burn at gvmc
జీవీఎంసీ వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని దగ్ధం చేసిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తుకు ఆదేశించాలని అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ ఛైర్మన్ ఎం.జగ్గునాయుడు కోరారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ దీక్షా శిబిరాన్ని ఉద్దేశపూర్వకంగా కొందరు దగ్ధం చేశారని పేర్కొన్నారు. దీంతో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.

ఫిబ్రవరి 29న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీగా, స్టీల్ ప్లాంట్లోని అన్ని ట్రేడ్ యూనియన్లుతో పరిరక్షణ పోరాట కమిటీగా ఏర్పడి గత 100రోజులుగా నిరసనలు తెలియజేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం కాకుండా కాపాడుకోవడానికి నగరవ్యాప్తంగా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు వివిధ సంఘాలు.. వైజాగ్ స్టీల్ ప్లాంట్, ప్రభుత్వరంగ పరిశ్రమల పరిరక్షణ పోరాట కమిటీగా ఏర్పడి వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అందులో భాగంగా గత 52రోజుల నుంచి స్థానిక గాంధీ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షాల శిబిరాన్ని నిర్వహిస్తుంది.
ఇదీ చూడండి..విశాఖ ఉక్కు నిరాహార దీక్ష శిబిరంలో మంటలు