IIM Visakha: విశాఖ ఐఐఎం 2021-23 బ్యాచ్ విద్యార్థులంతా వంద శాతం ఉద్యోగాలు సాధించి ప్లేస్మెంట్ రికార్డు నమోదు చేశారు. మరో సెమిస్టర్ ఇంకా ఉండగానే వీరందరూ మంచి ప్యాకేజితో ఉద్యోగాలు దక్కించుకున్నారు. పని అనుభవం ఉన్న అభ్యర్ధులకు సగటున రూ.17.21 లక్షల వార్షిక వేతనంతోనూ, పని అనుభవం లేని గ్రాడ్యుయేట్లకు రూ.15.47 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు లభించాయి. అత్యధిక వార్షిక వేతనం 32 లక్షల రూపాయిలతో ఉద్యోగానికి ఒకరు ఎంపికయ్యారు. పదిశాతం టాప్ అభ్యర్దులకు సగటు వేతనం రూ.22.72 లక్షలు, తర్వాత 25 శాతం మందికి రూ.20.02 లక్షల సగటు వేతనం, 50 శాతం మందికి రూ.17.94 లక్షల సగటు వేతనంతో ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
విశాఖ ఐఐఎం రికార్డ్.. వంద శాతం ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు - ఐఐఎం డైరక్టర్ ప్రోఫెసర్ ఎం చంద్రశేఖర్
IIM Visakha: విశాఖ ఐఐఎం 2021-23 బ్యాచ్ విద్యార్థులు రికార్డ్ నమోదు చేశారు. ఇంకొక సెమిస్టర్ మిగిలి ఉండగానే విద్యార్థులందరూ ఉద్యోగాలు సాధించడం విశేషం. ఐఐఎం విశాఖలో చదువుకుంటున్న ఈ బ్యాచ్ అభ్యర్దులను ఎంపిక చేసుకునేందుకు వంద కంపెనీలు తమ వద్ద ఉన్న అవకాశాలను వీరికి పరిచయం చేశాయి.
విశాఖ ఐఐఎం
ఐఐఎం విశాఖలో చదువుకుంటున్న ఈ బ్యాచ్ అభ్యర్దులను ఎంపిక చేసుకునేందుకు 100 కంపెనీలు రాగా, 61 మంది విద్యార్థులు వివిధ కంపెనీల విభాగాల్లో అవకాశాలు అందిపుచ్చుకున్నారు. ఈ ఉద్యోగాలు పొందిన విద్యార్థులను ఐఐఎం డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం. చంద్రశేఖర్ అభినందించారు.
ఇవీ చదవండి: