ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన - aituc latest news vishakapatnam

కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ విశాఖలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు.

aituc protest against petrol rates at vishakapatnam
పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని ఏఐటీయూసీ నిరసన

By

Published : Jun 15, 2020, 4:35 PM IST

పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని కోరుతూ విశాఖ జిల్లాలోని సీతమ్మధార కూడలిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వామన మూర్తి మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్​పై వేసిన సుంకాలను తగ్గించాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్​లో క్రూడాయిల్ ధరలు తగ్గుతున్న సందర్భంలో... పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ సభ్యులు కేంద్రప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి పెట్రో ఉత్పత్తుల ధరలను తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రావికృష్ణ, అప్పలరాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

ఇదీచదవండి: తెదేపా ఎమ్మెల్యే పై వైకాపా వర్గీయుల రాళ్లదాడి...కార్యకర్తలకు గాయాలు

ABOUT THE AUTHOR

...view details