ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఉపాధి కోల్పోయిన ప్రతి కుటుంబానికి రూ.10వేలు ఇవ్వాలి' - ఏఐటీయుసీ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి

కరోనా కాలంలో ఉపాధి కోల్పోయిన ప్రతి కుటుంబానికి రూ.10వేలు జీవనభృతి కల్పించాలని ఏఐటీయూసీ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి కోరారు.

vishaka district
ఉపాధి కోల్పోయిన ప్రతి కుటుంబానికి రూ.10వేల ఇవ్వాలి

By

Published : Aug 8, 2020, 6:21 PM IST

విశాఖ అక్కయ్యపాలెం నరసింహ నగర్ రైల్వే కూడలిలో ఆటో డ్రైవర్లు, చిల్లర వర్తకులు, ఐస్ క్రీమ్ బండ్ల కార్మికులు నిరసన నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయల రాయితీలు ఇస్తూ, వడ్డీ మాఫీలు చేస్తూ, పేద, మధ్యతరగతి ప్రజలు, కార్మికులు, రైతాంగంపై ఆర్థిక భారాలను మోపుతున్నాయని ఏఐటీయూసీ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి ఆరోపించారు. కరోనా కాలంలో ఉపాధి కరువైన అన్నివర్గాలకు రూ. పది వేలు జీవన భృతి, ఆరు నెలల పాటు 16 రకాల నిత్యావసరాలు అందించాలని కోరారు.

ఆటో కార్మికులు, సొంత వాహనం కార్మికులకు ఆరు నెలల పాటు బ్యాంకు రుణాల వడ్డీని మాఫీ చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో రవి కృష్ణా, సాయి, సూర్యారావు, పైడిరాజు, నరసింగరావు, ఎస్. రాము, డీజే జగన్నాథం, కె. ప్రభాకర్ రావు, పి. అప్పారావు, పి. చక్రపాణి, శివ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండిఒక్క ఎమ్మెల్యే గెలిచినా మంత్రి పదవికి రాజీనామా చేస్తా: అవంతి

ABOUT THE AUTHOR

...view details