ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Airport Express Metro : అతిపెద్ద మెట్రో కారిడార్‌ ఇదే - shamshabad Airport Express Metro

Airport Express Metro : తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో మెట్రో సేవల విస్తరణ దిశగా రెండో దశ పనులకు సీఎం కేసీఆర్‌ ఇటీవలే శంకుస్థాపన చేశారు. ఈ సర్వీసులు అందుబాటులోకి వస్తే శంషాబాద్‌ నుంచి సిటీలోని ఇతర ప్రాంతాలకు ప్రయాణం సుగమం అవుతుందని భావిస్తున్నారు. ఇది పూర్తైతే అతి పెద్ద మెట్రో కారిడార్​గా అవతరించనుంది.

metro corridor
మెట్రో కారిడార్‌

By

Published : Dec 10, 2022, 3:28 PM IST

Airport Express Metro :తెలంగాణలోని హైదరాబాద్ నగర ఆధునిక ప్రజా రవాణాలో మరో ముందడుగు పడింది. మెట్రో.. మరిన్ని ప్రాంతాలకు విస్తరించే రెండో దశ ప్రాజెక్ట్‌కు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపనతో ఆయా ప్రాంతవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శంషాబాద్‌ నుంచి సిటీలోని ఇతర ప్రాంతాలకు ప్రయాణం సుగమం అవుతుందని భావిస్తున్నారు. ఐటీ కారిడార్‌లోని ఉన్నతోద్యోగులు నిత్యం పెద్ద సంఖ్యలో విమానాల్లో రాకపోకలు సాగిస్తుంటారు.

ఈ ఎక్స్‌ప్రెస్‌ మెట్రోతో వీరు 26 నిమిషాల్లో విమానాశ్రయం చేరుకోవచ్చు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు శంషాబాద్‌లోని ఓఆర్‌ఆర్‌ వద్ద దిగి గచ్చిబౌలికి వస్తుంటారు. మెట్రో పూర్తైతే వీరి ప్రయాణ కష్టాలు తీరనున్నాయి.

అన్నివైపులా అనుసంధానం..:ఎక్స్‌ప్రెస్‌ మెట్రో.. నాగోల్‌-రాయదుర్గం కారిడార్‌-3కి కొనసాగింపు. ఈ కారిడార్‌-3తో ఇప్పటికే కారిడార్‌1, 2.. అమీర్‌పేట, ఎంజీబీఎస్‌, పరేడ్‌ గ్రౌండ్స్‌ వద్ద అనుసంధానమై ఉన్నాయి.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details