ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆన్​లైన్​లోనూ టికెట్లు పొందవచ్చు: ఎయిర్ ఇండియా

విదేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడంలో సరికొత్త మార్గాన్ని ఎంచుకుంది ఎయిర్ ఇండియా. ఇప్పటివరకు ఎయిర్ ఇండియా కార్యాలయాల ద్వారా టికెట్ల విక్రయానికి అనుమతించిన సంస్థ... ఇకపై ఆన్​లైన్​లోనూ టిక్కెట్లను విక్రయిస్తోంది.

airindia provides tickets in online
ఆన్​లైన్​లోనూ టికెట్ల విక్రయానికి అనుమతించిన ఎయిర్ ఇండియా

By

Published : Jun 11, 2020, 8:01 AM IST

వందేభారత్ మిషన్​లో భాగంగా విదేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు చర్యలను వేగవంతం చేస్తోంది ఎయిర్ ఇండియా. ఇప్పటికే రెండు దశల్లో వేల మందిని భారత్ గడ్డకు చేర్చిన ఎయిర్ ఇండియా... మూడో దశ కింద అరబ్ దేశాలు, యూఎస్ , కెనడా వంటి దేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు విమాన సేవలు అందిస్తోంది. వీరికి టికెట్లను ఇప్పటివరకు ఎయిర్ ఇండియా కార్యాలయాల్లోనే విక్రయించేవారు. తాజాగా ఆన్​లైన్ ద్వారా కూడా టిక్కెట్ల విక్రయానికి అనుమతించింది. ఈ సదుపాయం ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుందని ఎయిర్ ఇండియా భావిస్తోంది.

ఇదీ చూడండి:వందే భారత్ మిషన్​: గన్నవరం చేరుకున్న ప్రవాసాంధ్రులు

ABOUT THE AUTHOR

...view details