దేశంలో కొవిడ్ ప్రవర్తనా నియమావళిని పాటించడంపైనే మూడో వేవ్ ఆధారపడి ఉంటుందని దిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. విశాఖపట్నంలోని గీతం విశ్వవిద్యాలయం 41వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొనేందుకు గులేరియా విశాఖ వచ్చారు. ఆయనకు గీతం విద్యా సంస్థల ఛైర్మన్ శ్రీభరత్.. గీతం ఫౌండేషన్ డే అవార్డును అందించారు. ఈ సందర్భంగా.. కొవిడ్ కేసులపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
పిల్లలపై తీవ్రంగా ప్రభావం ఉంటుందన్న దానికి సరైన అధ్యయనం లేదని, కేవలం వాళ్లకు వ్యాక్సినేషన్ కాలేదు కాబట్టి ఎక్కువగా వైరస్ బారిన పడేవాళ్లలో అధికంగా ఉంటారని మాత్రమే అంచనా వేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ప్రత్యేకంగా ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాలలో ఇప్పుడు కేసులు పెరుగుతున్నాయని, కొవిడ్ ప్రవర్తనా నియమావళిని ఏ మేరకు పాటిస్తున్నామనే అంశంపైనే వైరస్ వ్యాప్తి ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.