ప్రజలు ప్రతి పైసా జమ చేసి బీమా రూపంలో దాచుకుంటే కేంద్ర ప్రభుత్వం వాటిపై జీఎస్టీ వేయడం సమంజసం కాదని అఖిల భారత బీమా ఉద్యోగ సంఘాల జాతీయ సమావేశం అభిప్రాయపడింది. ప్రభుత్వ రంగ బీమా సంస్థలలో విదేశీ పెట్టుబడులు, ప్రైవేటీకరణ దిశగా కేంద్రం ఆలోచించడం సరికాదని దక్షిణ మధ్య బీమా రంగ ఉద్యోగ సంఘ అధ్యక్షుడు వేణుగోపాలరావు నిరసన వ్యక్తం చేశారు.
విశాఖలో అఖిల భారత బీమా ఉద్యోగుల జాతీయ సదస్సు - aiiea demands
విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయ కన్వెన్షన్ సెంటర్ వేదికగా మూడు రోజులు పాటు అఖిల భారత భీమా రంగ ఉద్యోగ సంఘ జాతీయ సదస్సు జరుగుతోంది. ఈ సదస్సులో బీమా రంగంలో సమస్యలపై చర్చించారు.

విశాఖ లో అఖిల భారత భీమా రంగ ఉద్యోగ సంఘ జాతీయ సదస్సు
విశాఖ లో అఖిల భారత భీమా రంగ ఉద్యోగ సంఘ జాతీయ సదస్సు
TAGGED:
aiiea demands