రాష్ట్ర ప్రభుత్వం ఇసుక విధానంపై తీసుకున్న నిర్ణయాన్ని భవన నిర్మాణ కార్మికులు విశాఖ జిల్లా నర్సీపట్నంలో వ్యతిరేకించారు. భారీ ర్యాలీ నిర్వహించారు. భవన నిర్మాణ కార్మికులు, ఎలక్ట్రీషియన్లు, ఇటుక బట్టీ యజమానులు, ఐరన్ వ్యాపారులు, ప్లంబింగ్ పనివారు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సీఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన.. శ్రీకన్య కూడలి నుంచి ర్యాలీగా బయలుదేరి కృష్ణా బజార్ వరకూ నిర్వహించారు. ర్యాలీలో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ప్రజల అవసరాలకు తగినంతగా ఇసుకను సరఫరా చేయాలన్నారు.
ఇసుక కోసం.. నర్సీపట్నంలో ఆందోళన - agitation for sand in narsipatnam
విశాఖ జిల్లా నర్సీపట్నంలో భవన నిర్మాణ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇసుక విధానంపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు.
![ఇసుక కోసం.. నర్సీపట్నంలో ఆందోళన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4938280-511-4938280-1572680895958.jpg)
ఇసుక కోసం ఆందోళన