తెలుగు రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో నేడు బంద్ - జీవో 3 రద్దు న్యూస్
జీవో 3 రద్దుకు నిరసనగా తెలుగు రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో నేడు బంద్‌కు పిలుపునిచ్చింది జీవో 3 సాధన కమిటీ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్ వేసి ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా జీవో 3 చట్టం తేవాలని డిమాండ్ చేసింది.
agency-bundh-in-telugu-states
గిరిజనులకు ఉపాధ్యాయ పోస్టుల్లో వంద శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఇచ్చిన జీవో-3ని సుప్రీం కోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. రద్దుకు నిరసనగా జీవో 3 సాధన కమిటీ బంద్‌కు పిలుపునిచ్చింది. మన్యం బంద్‌ను విజయవంతం చేయాలంటూ రెండు వారాల నుంచి ఏజెన్సీ వ్యాప్తంగా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. పాడేరు, అరకులోయ, చింతపల్లితోపాటు అన్ని మండలాల్లో పూర్తిస్థాయిలో బంద్ నిర్వహించడానికి గిరిజన నేతలు చర్యలు చేపట్టారు.
Last Updated : Jun 9, 2020, 12:52 PM IST