హైకోర్టును కర్నూలుకు తరలించవద్దు: న్యాయవాదులు - Worry
రాష్ట్ర హై కోర్టును కర్నూలుకు తరలిస్తారన్న వార్తలపై న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వదంతులపై ముఖ్యమంత్రి జగన్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
న్యాయవాదులు
హైకోర్టును అమరావతిలోనే ఉంచాలంటూ న్యాయవాదులు ఆందోళనకు దిగారు. మధ్యాహ్న భోజన విరామంలో హైకోర్టు ఎదుట నిరసన గళం వినిపించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. న్యాయస్థానాన్ని రాజధానిలోనే ఉంచాలని వారు డిమాండ్ చేశారు. తరలించటం వల్ల దాదాపు 120 నియోజకవర్గాల్లోని పిటిషనర్లు ఇబ్బంది పడే అవకాశం ఉందని న్యాయవాదులు అన్నారు. ప్రజల్లో ఆందోళన నెలకొన్నందున హైకోర్టుపై ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించాలని కోరారు.