సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తూ అడై కృత్తిక పర్వదినాన్ని విశాఖ శారదాపీఠం ఘనంగా నిర్వహించింది. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర... స్వామివారికి పంచామృతాలతో ప్రత్యేకాభిషేకాలు చేశారు. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి స్తోత్రాలను పఠిస్తూ పలు పూజాధికాలు చేపట్టారు. అడై కృత్తిక పర్వదినాన్ని ప్రతి ఏటా ఆషాఢ ఏకాదశి రోజున నిర్వహిస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజుగా అడై కృత్తికను అభివర్ణిస్తారు. ఏటా చాతుర్మాస్య దీక్షా కాలంలో అడై కృత్తిక వస్తుంది. చాతుర్మాస్య దీక్ష కోసం ప్రస్తుతం ఋషికేష్లో ఉన్న విశాఖ శారదా పీఠాధిపతులు ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఈ పర్వదినాన్ని వేడుకగా నిర్వహించారు.
విశాఖ శారదాపీఠంలో అడై కృత్తిక వేడుకలు - విశాఖ శారదా పీఠంలో అడై కృత్తిక వేడుకలు
విశాఖ శారదాపీఠంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తూ అడై కృత్తిక పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర... స్వామివారికి పంచామృతాలతో ప్రత్యేకాభిషేకాలు చేశారు.
విశాఖ శారదాపీఠంలో అడై కృత్తిక వేడుకలు