ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Niharika: ఆ అందంపై.. మనసు పారేసుకున్నా : నిహారిక

మెగాడాటర్ నిహారిక ప్రస్తుతం ఓ వెబ్​సిరీస్ లో నటిస్తున్నారు. ఈ వెబ్​సిరీస్ షూట్ లో భాగంగా.. ఆంధ్రా కశ్మీర్‌ లంబసింగి(lambasinghi) చేరుకున్నారు. అక్కడి అందాలు తనివితీరా ఆస్వాదించిన నిహారిక.. ఆ సోయగాలకు ఫిదా అయ్యానన్నారు.

actress  niharika at lambasinghi
లంబసింగి అందాలు అద్భుతం: నిహారిక

By

Published : Oct 8, 2021, 5:12 PM IST

ఆంధ్రా కశ్మీర్‌ లంబసింగి(lambasinghi) అందాలు అద్భుతంగా ఉన్నాయని సినీ నటి నిహారిక(actress niharika) అన్నారు. హీరో కాస్కో నిఖిల్‌తో కలిసి ఆమె ఓ వెబ్‌ సిరీస్‌(web series)లో నటిస్తున్నారు. ఈ వెబ్‌ సిరీస్‌ చిత్రీకరణ.. బుధవారం లంబసింగి చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగింది.

కృష్ణాపురం, తాజంగి జలాశయం ప్రాంతాల్లో క్లైమాక్స్‌ ఫైటింగ్‌ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ వెబ్‌ సిరీస్‌కు భాను ధీరజ్‌నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్‌ అనంతరం మాట్లాడిన నిహారిక (actress niharika).. తాను ఇంతవరకూ హీరోయిన్‌గా నాలుగు సినిమాలు, మూడు వెబ్‌సిరీస్‌ల్లో నటించానని చెప్పారు. ఇక్కడకు తొలిసారిగా వచ్చానని, ఈ ప్రాంతం షూటింగ్‌కు ఎంతో అనువుగా ఉందని అన్నారు నిహారిక.

ABOUT THE AUTHOR

...view details