ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖలో రైటర్స్ అకాడమీ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో ఆర్.నారాయణమూర్తి పాల్గొన్నారు. గంగవరం పోర్ట్ ప్రత్యేకంగా ఉక్కు పరిశ్రమ కోసం నిర్మించారని.. కానీ ఆ పోర్టును ప్రైవేట్ వ్యక్తుల చేతులో పెట్టడం వల్ల నష్టం జరిగిందని నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. సొంత గనులు ఇవ్వాలని కోరినా... ఇవ్వకుండా ఉక్కు పరిశ్రమను ఇబ్బంది పెట్టారని ఆయన విమర్శించారు. విశాఖ ఉక్కును కాపాడుకునే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు.
ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయం... ఆర్.నారాయణమూర్తి ఆగ్రహం - విశాఖ ఉక్కు పోరాటంలో పాల్గొన్న సినీ నటుడు ఆర్ నారాయణ మూర్తి
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్మయం ముమ్మాటికీ ద్రోహమని ఆర్.నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు జాతి గౌరవాన్ని కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలని మూర్తి సూచించారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై ఆగ్రహించిన ఆర్ నారాయణ మూర్తి