బిగ్బాస్ ఫేమ్, సినీనటి హిమజ విశాఖలో సందడి చేశారు. నగరంలోని సంపత్ వినాయక టెంపుల్ రోడ్డులో షిమివోగ్ మొదటి ఔట్లైట్ను ఆమె ప్రారంభించారు. పలు తెలుగు సినిమాల్లో నటించినా రాని గుర్తింపు.. బిగ్ బాస్ షో ద్వారా తనకు వచ్చిందని హిమజ తెలిపారు. కొరియా దేశానికి సంబంధించిన షిమివోగ్ షాప్ను ప్రారంభించడం ఎంత ఆనందంగా ఉందన్నారు. అన్ని రకాల వస్తువులు ఒకే దగ్గర వినియోగదారులకు తక్కువ ధరలకు లభించడం బాగుందని చెప్పారు. షిమివోగ్ విశాఖలో మరిన్ని శాఖలు ప్రారంభించాలని ఆకాంక్షించారు. అనంతరం ఆమె అభిమానులతో ఫొటోలు దిగి ఆనందింపజేశారు.
విశాఖలో సినీనటి హిమజ సందడి... - విశాఖలో బిగ్బాస్ ఫేమ్ హిమజ సందడి...
కొరియా దేశానికి చెందిన షిమివోగ్ షాప్ను సినీనటి హిమజ విశాఖలో ప్రారంభించారు. ఇక్కడ అన్ని రకాల వస్తువులు వినియోగదారులకు తక్కువ ధరలకు లభించడం బాగుందన్నారు.

విశాఖలో బిగ్బాస్ ఫేమ్ హిమజ సందడి...