ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మాడుగులలో చురుగ్గా గ్రామ సచివాలయ నిర్మాణ పనులు' - farmer help centres latest News

విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పరుగులు తీస్తున్నాయి. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. నిర్మాణ పనులు చురుగ్గా చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

'మాడుగులలో చురుగ్గా గ్రామ సచివాలయ నిర్మాణ పనులు'
'మాడుగులలో చురుగ్గా గ్రామ సచివాలయ నిర్మాణ పనులు'

By

Published : Oct 1, 2020, 8:13 PM IST

విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని మాడుగుల, చీడికాడ, కె.కోటపాడు, దేవరాపల్లి మండలాల్లో గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి.

దాదాపు రూ.60 కోట్ల ఖర్చు..

ఈ పనులు ప్రస్తుతం నియోజకవర్గ పరిధిలో జోరుగా కొనసాగుతున్నాయి. మాడుగుల వ్యాప్తంగా 78 గ్రామ సచివాలయాలు, 78 రైతు భరోసా కేంద్రాలు, 67 గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు మంజూరైనట్లు పంచాయతీరాజ్ శాఖ డీఈఈ రమణ పేర్కొన్నారు. నిర్మాణానికి దాదాపుగా రూ.60 కోట్లకుపైగా నిధులను ఖర్చు చేయనున్నట్లు వివరించారు. ఈ భవన నిర్మాణ పనులన్నీ వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి చేయాలని ఆదేశించినట్లు అధికారులు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:

తెదేపా మహిళా కార్యవర్గం సభ్యులు వీరే

ABOUT THE AUTHOR

...view details