విశాఖకు చెందిన పి.అచ్యుత రెడ్డి... అంతర్జాతీయ పారా తైక్వాండో కోచ్‌గా ఎంపికయ్యారు. ఈనెల 11 నుంచి 13 వరకు ప్రపంచ పారా తైక్వాండో సమాఖ్య.. జూమ్ ప్లాట్‌ఫారంపై సర్టిఫికెట్ కోర్సును నిర్వహించింది.
ఇందులో అచ్యుతరెడ్డి వివిధ విభాగాల్లో ఉత్తీర్ణత పొందారు. రాష్ట్రం నుంచి ఈ ఘనత సాధించిన మొదటి పారా తైక్వాండో కోచ్ గా ఆయన గుర్తింపు పొందారు. తైక్వాండో సంఘ ప్రతినిధులు, శిక్షకులు, క్రీడాకారులు అచ్యుత రెడ్డిని అభినందించారు.