ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమంగా గంజాయి తరలిస్తుండగా ప్రమాదం... ఒకరికి గాయాలు, మరొకరు పరారు - విశాఖ జిల్లాలో గంజాయి స్మగ్లింగ్

విశాఖ జిల్లా అనంతగిరి మండలం చిలకలగడ్డ అటవీ చెక్​పోస్టు వద్ద ప్రమాదం జరిగింది. అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ప్రమాదానికి గురయ్యారు.

అక్రమంగా గంజాయి తరలిస్తుండగా ప్రమాదం...ఒకరికి గాయాలు, మరొకరు పరారు
అక్రమంగా గంజాయి తరలిస్తుండగా ప్రమాదం...ఒకరికి గాయాలు, మరొకరు పరారు

By

Published : Jun 10, 2021, 8:19 PM IST

విశాఖ జిల్లా అనంతగిరి మండలం చిలకలగడ్డ అటవీ చెక్​పోస్టు వద్ద ప్రమాదం జరిగింది. అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ప్రమాదానికి గురయ్యారు. ద్విచక్ర వాహనంపై పారిపోతూ చెక్​పోస్టు వద్ద అడ్డుగా ఉంచిన కర్రను ఢీకొని కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా..మరో వ్యక్తి పరారయ్యాడు. గాయాలైన వ్యక్తిని ఎస్​. కోట ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వ్యక్తి వద్ద సంచిలో పోలీసులు గంజాయిని గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details