విశాఖ జిల్లా రావికమతం మండలం గుడివాడకు చెందిన సుమారు 24 మంది.. పాడేరులోని మోదకొండమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్లారు. దర్శనానంతరం వారి తిరుగు ప్రయాణంలో ఘాట్ రోడ్డులో వాట్లమామిడి నుంచి 5 కిలోమీటర్లు దిగువకు వచ్చేసరికి... వారు ప్రయాణిస్తున్న బొలేరో వాహనం బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. అప్రమత్తమైన డ్రైవర్... ప్రయాణికులను అప్రమత్తం చేసి, ఎడమవైపు పెద్ద లోయ ఉండటంతో, కుడివైపున ఉన్న బండరాయికి ఢీకొట్టాడు. దీంతో ప్రాణాపాయం తప్పింది. బండరాయికి వాహనం ఢీకొనటంతో 10 మందికి గాయాలయ్యాయి. వెంటనే గాయపడ్డవారిని మాడుగుల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించినట్లు బంధువులు తెలిపారు.
పాడేరు ఘాట్ రోడ్డులో వాహనం బోల్తా.. పది మందికి గాయాలు
విశాఖ జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో... మినుములూరు వద్ద బొలెరో వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పది మంది గాయపడగా... ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని మాడుగుల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
పాడేరు ఘాట్ రోడ్డులో వాహనం బోల్తా.. పది మందికి గాయాలు