ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పొలాల్లోకి దూసుకెళ్లిన కారు...తప్పిన ప్రమాదం - పాడేరు వార్తలు

విశాఖ జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో ప్రమాదం తప్పింది. ఆదివారం అర్ధరాత్రి ఓ కారు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో వాహనంలో ఉన్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

Accident on Paderu Ghat Road in visakha
పాడేరు ఘాట్ రోడ్డులో ప్రమాదం

By

Published : Sep 28, 2020, 1:45 PM IST

Updated : Sep 28, 2020, 5:05 PM IST


విశాఖ జిల్లా పాడేరు ఘాట్ రోడ్డు కంద మామిడి జంక్షన్ వద్ద అర్ధరాత్రి కారు పొలాల్లోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో వాహనచోదకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మినుములూరు కాఫీ హౌస్ వద్ద ప్రమాదకరమైన మలుపు ఉంది. వేగంగా వచ్చిన వాహనం ఆ మలుపు తిరగలేక... పొలాల్లోకి దూసుకుపోయింది. వాహనదారులు కారును బయటకుతీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన మలుపు కావటంతో ...తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.

Last Updated : Sep 28, 2020, 5:05 PM IST

ABOUT THE AUTHOR

...view details