విశాఖ జిల్లా కసింకోట మండలం తాళ్లపాలెం జాతీయ రహదారి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దంపతులు మృతి చెందారు. పొలం వెళుతున్న కరణం సోమినాయుడు, అతని భార్య పైడితల్లమ్మను పెట్రోల్ ట్యాంకర్ ఢీకొట్టింది. వారిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. లారీని అక్కడే వదిలి డ్రైవర్ పరారయ్యాడు. మృతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దంపతుల మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి - వైజాగ్లో రోడ్డు ప్రమాదం వార్తలు
పొద్దునే పొలం వెళుతున్న దంపతులను మృత్యువు కబళించింది. రోడ్డు దాటుతున్న ఇద్దర్నీ ట్యాంకర్ ఢీకొట్టటంతో.. వారు అక్కడికక్కడే మృతి చెందారు.
రోడ్డుప్రమాదంలో భార్యాభర్తలు మృతి
Last Updated : Nov 1, 2019, 6:02 PM IST