విశాఖ జిల్లా అనకాపల్లిలోని విజయరామరాజుపేట సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. భారీ వాహనాలు రాకపోకలు సాగించడానికి వీలులేకుండా కిందవంతెన వద్ద గడ్డర్‌ను ఏర్పాటుచేశారు. అనకాపల్లి నుంచి చోడవరం వెళ్తున్న లారీ ఆ గడ్డర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ గడ్డర్‌కు, లారీకి మధ్యలో ఇరుక్కుపోయాడు. స్థానికులు అతడిని బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
గడ్డర్‌ను ఢీకొన్న లారీ.. ఇరుక్కుపోయిన డ్రైవర్ - అనకాపల్లిలో రోడ్డు ప్రమాదం తాజా వార్తలు
విశాఖ జిల్లా అనకాపల్లిలోని విజయరామరాజుపేట సమీపంలో.. ఓ లారీ గడ్డర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి.
గడ్డర్‌ను ఢీకొన్న లారీ.. ఇరుక్కుపోయిన డ్రైవర్