ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓ వ్యక్తి నిర్లక్ష్యం... తీసింది దంపతుల ప్రాణం - dead

తాళ్లపాలెం జాతీయ రహదారిపై హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యం... దంపతుల ప్రాణం తీసింది. ఇద్దరు పిల్లలకు అమ్మానాన్నలను దూరం చేసింది.

ప్రమాదానికి కారణమైన వాహనం

By

Published : Jul 18, 2019, 2:34 AM IST

ఓ వ్యక్తి నిర్లక్ష్యం... తీసింది దంపతుల ప్రాణం

విశాఖ జిల్లా కసింకోట మండలం తాళ్లపాలెం జాతీయ రహదారి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలు మృతి చెందారు. తుని నుంచి దువ్వాడ వైపు అతి వేగంతో వస్తున్న కారు తాళ్లపాలెం వద్దకు రాగానే డివైడర్​ని ఢీకొట్టి రోడ్డు అవతలి వైపుకి వెళ్లింది. అదే సమయంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న దంపతులను కారు ఢీకొంది. ఘటనలో ఇద్దరూ మృతి చెందారు. ప్రమాదానికి కారకుడైన కారు డ్రైవర్ స్వరూప్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన ఓ ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం అతన్ని చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్​కి తరలించారు. మృతులను తూర్పు గోదావరి జిల్లా మల్లవరం ప్రాంతానికి చెందిన దంపతులు కె. రమణ, లక్ష్మిగా గుర్తించారు. వారు.. ఇద్దరు పిల్లలతో కలిసి దువ్వాడ లోని రాజీవ్ నగర్​లో నివాసం ఉండేవారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details