విశాఖ ఉక్కు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఉన్నతాధికార్ల పరిస్థితి ఆందోళనకరం - నేటి తెలుగు వార్తలు
13:58 February 11
ద్రవ ఉక్కు మీదపడి 9 మంది కార్మికులకు గాయాలు
Visakha Steel Plant Accident : విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఉక్కు ద్రవాన్ని తీసుకెళ్తున్న లాడెల్ ఎస్‌ఎంఎస్-2లో పగిలి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిలో డీజీఎం అనిల్ దహివాలే, సీనియర్ మేనేజర్ జయకుమార్ పరిస్థితి విషమంగా ఉంది. వారితో పాటు ఒప్పంద కార్మికుల పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మరో ఆరుగురు కార్మికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. మొత్తంగా 10 మందికి గాయాలయ్యాయి.
ఇవీ చదవండి :