ఒక సెక్షన్‌లో పనిచేసే ఏఈకి రూ.30కోట్లకు పైగా విలువచేసే ఆస్తులుండటం ఆశ్చర్యంకాక మరేంటి? గురవారం ఒక్కరోజే విశాఖలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఏసీబీ దాడుల్లో రికార్డుల ప్రకారమే రూ.3.88కోట్లకుపైగా ఆస్తులున్నట్లు వెలుగుచూసింది. ఇది ఇప్పటి మార్కెట్ ప్రకారం 10రెట్లు ఉండొచ్చని అధికారిక వర్గాల్లో వెల్లడవుతోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో అరెస్టయిన విశాఖకు చెందిన మాడెం నాగేశ్వరరావు పరిచయమిది.
సర్వీసు రికార్డు ఇదీ..
* 1991లో లైన్‌మెన్‌గా చేరిక
* 1992లోనే సబ్‌ఇంజినీర్‌గా పదోన్నతి
* 1994లో డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన వైనం
* ఏసీబీకి చిక్కిన సుమారు పదేళ్లకు ఉద్యోగం నుంచి డిస్మిస్ (28.11.2003)
* తిరిగి 2013 ఆగస్టు 12న సబ్ ఇంజినీర్‌గా పునర్నియామకం
* అలా వచ్చిన 10వ నెలలోనే.. ఏఈగా పదోన్నతి
* ప్రస్తుతం కొమ్మాదిలో ఏఈగా పనిచేస్తూ ఏసీబీ చేతిలో అరెస్టు
గుర్తించిన ఆస్తులు
(తొలిరోజు అధికారులకు స్పష్టత వచ్చిన ప్రకారం..)
* సీతంపేట, సీతమ్మధార ఆక్సిన్‌టవర్స్, ఎంవీపీకాలనీల్లో ఖరీదైన ఫ్లాట్లు
* మధురవాడలో సొంతిల్లు, మరోచోట ఇంకో ఇల్లు
* రెండు లాకర్లలో 250గ్రా బంగారం, మరో లాకర్ గుర్తింపు
* రూ.1.50కోట్ల విలువచేసే ఫిక్స్‌డ్‌డిపాజిట్లు
* బ్యాంకు ఖాతాల్లో రూ.14లక్షలు
* భార్య, కుమారుని పేరుమీదా పలు ఆస్తులు
* రెండు కార్లున్నట్లు గుర్తింపు
* గురువారం రాత్రిదాకా రికార్డుల్లో రూ.3.88కోట్ల అక్రమాస్తులు, ప్రస్తుత మార్కెట్‌లో 10రెట్ల విలువ
* హైదరాబాద్‌లోనూ మరికొన్ని ఆస్తులున్నట్లు గుర్తింపు, అక్కడ కూడా ఓ లాకర్, బ్యాంకు ఖాతా
ఈపీడీసీఎల్ కొమ్మాది సబ్‌స్టేషన్‌లో ఏఈగా పనిచేస్తున్న మాడెం నాగేశ్వరరావు అవినీతి, అక్రమాలు ఏసీబీ దాడుల్లో గుప్పుమన్నాయి. గురువారం ఏకకాలంలో నగరం, చుట్టుపక్కల 12చోట్ల దాడులు జరిపారు. కార్యాలయం, ఇళ్లు, కుటుంబీకులు, బంధువుల ఇళ్లనీ సోదాచేశారు. శుక్రవారం వీటిని కొనసాగించడంతో పాటు హైదరాబాద్‌కూ ప్రత్యేక బృందాల్ని పంపుతున్నట్లు ఏసీబీ అధికారులు ప్రకటించారు.