విశాఖ జిల్లా పద్మనాభం మండల సర్వేయర్ ఉపేంద్రరావు.. ఓ రైతు నుంచి 11 వేల రూపాయలు లంచం తీసుకుటుండగా.. అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. బాంధేపురానికి చెందిన రైతు వద్ద.. లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న మద్ది సచివాలయ సర్వేయర్ భాస్కర్, బాంధేపురం సచివాలయ సర్వేయరు మధునూ అనిశా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో ప్రశ్నిస్తున్నారు.
ACB RAIDS: రైతు నుంచి లంచం తీసుకుంటూ.. - ఏపీ తాజా వార్తలు
విశాఖ జిల్లా పద్మనాభం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. పద్మనాభం మండల సర్వే ఉపేంద్రరావు ఓ రైతు నుండి రూ.11వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
Acb Rides