ఈఎస్ఐ వ్యవహారంలో తెలుగుదేశం నేత అచ్చెన్నాయుడు సహా ఆరుగురిని అరెస్టు చేసినట్లు అనిశా జేడీ రవికుమార్ స్పష్టం చేశారు. ఫేక్ ఇన్వాయిస్లతో మందుల కొనుగోలు చేసినట్లు ఆధారాలున్నాయని వెల్లడించారు. కనీసం ప్రధాన కార్యదర్శికి తెలియకుండా కొన్ని వ్యవహారాలు జరిగాయని అనిశా జేడీ చెప్పారు.అచ్చెన్నాయుడు అరెస్టుకు సంబంధించిన వివరాలను ఆయన విశాఖలో మీడియాకు వెల్లడించారు.
'నిధుల దుర్వినియోగం నిర్ధరణ.. అందుకే అరెస్టు చేశాం' - ఏపీ ఏసీబీ వార్తలు
తెదేపా హయాంలో మందుల కొనుగోలులో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం జరిగినట్టు నిర్ధరణ అయిందని అనిశా అధికారులు వెల్లడించారు. ఫేక్ ఇన్వాయిస్‌తో మందులు కొనుగోలు చేశారని వెల్లడించారు. విజిలెన్స్ రిపోర్టుపై అనిశా విచారణ చేస్తూ అచ్చెన్నాయుడితో సహా ఆరుగురిని అరెస్టు చేశామని తెలిపారు.
acb officials respond on achennaidu arrest
'అచ్చెన్నాయుడిని ఉదయం 7.30 గంటలకు అరెస్టు చేశాం. ఇదే కేసులో అచ్చెన్నాయుడితో పాటు మొత్తం ఆరుగురు అరెస్టు అయ్యారు. వీరందరూ ప్రభుత్వ నిబంధనలను ఉల్లఘించినట్టు నిర్ధరణ అయింది. ఫేక్ ఇన్వాయిస్‌తో మందుల కొనుగోలు చేశారు. కనీసం ప్రిన్సిపల్ సెక్రటరీకి తెలియకుండా కొన్ని ప్రక్రియలు చేపట్టారు. విజిలెన్స్ రిపోర్టుపై విచారణ చేస్తూ అరెస్టు చేశాం. విజయవాడలో ప్రత్యేక నాయ్యమూర్తి వద్ద సాయంత్రం వీరిని హాజరుపరుస్తాం' -రవికుమార్, అనిశా జేడీ
Last Updated : Jun 12, 2020, 10:38 PM IST