ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ARREST: విశాఖలో అవినీతి ఎస్సైను రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్న అనిశా - విశాఖ వార్తలు

విశాఖ ఆరిలోవ పోలీసు స్టేషన్​లో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఎస్సై లంచం తీసుకుంటూ అనిశా వలలో చిక్కారు. ఓ కేసు విషయంలో బాధితుడి నుంచి సొమ్ము డిమాండ్ చేయడంతో అతడు అనిశా అధికారులను ఆశ్రయించాడు. విచారణ చేపట్టిన అధికారులు కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు.

ARREST
ARREST

By

Published : Aug 20, 2021, 3:53 PM IST

విశాఖ ఆరిలోవ పోలీసు స్టేషన్​లో లంచం తీసుకుంటూ ఎస్సై శ్రీనివాసరావు అనిశా అధికారుల వలకు చిక్కాడు. ఓ కేసుకు సంబంధించి బాధితుడి వద్ద నుంచి రూ. 7 వేలు లంచం తీసుకుంటుండగా స్టేషన్​లో రెడ్ హ్యాండెడ్​గా అధికారులు పట్టుకున్నారు.

ఆరిలోవలోని శ్రీ క్రాంతినగర్​కు చెందిన బి. వైకుంఠరావు అనే వ్యక్తికి సంబంధించి ఓ కేసులో తన కుటుంబ సభ్యుల పేర్లను తొలగించి తనకు 41A (స్టేషన్ బెయిల్) నోటీస్ ఇచ్చేందుకు ఎస్సై శ్రీనివాసరావు లంచం డిమాండ్ చేశాడు. డబ్బుల కోసం ఎస్సై ఒత్తిడి తేవడంతో, లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు అనిశాను ఆశ్రయించాడు. పక్కా ప్రణాళిక ప్రకారం ఇవాళ ఎస్సైకి స్టేషన్లో లంచం సొమ్మును బాధితుడు అందజేశాడు. అదే సమయంలో అక్కడే ఉన్న అనిశా అధికారులు సదరు పోలీసు అధికారిని పట్టుకున్నారు. విచారణ అనంతరం కేసు నమోదు చేయనున్నట్లు అనిశా సీఐ లక్షణమూర్తి తెలిపారు..

ABOUT THE AUTHOR

...view details