ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Bribe: లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన వీఆర్వో

లంచం తీసుకుంటూ విశాఖ జిల్లా చీడికాడ వీఆర్వో రాజు అనిశాకు చిక్కాడు. భూమి మ్యూటేషన్ కోసం వచ్చిన రైతు నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన వీఆర్వో
లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన వీఆర్వో

By

Published : Oct 7, 2021, 8:15 PM IST

అనిశా వలలో మరో అవినీతి చేప చిక్కింది. మ్యూటేషన్ కోసం వచ్చిన రైతు నుంచి లంచం తీసుకుంటూ విశాఖ జిల్లా చీడికాడ వీఆర్వో ఏసీబీకి పట్టుబడ్డాడు. గ్రామ సచివాలయంలో రైతు నుంచి డబ్బు తీసుకుంటుండగా..అనిశా అధికారులు రెడ్​హ్యండెడ్​గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన నౌడు చిన దేముడు, ఆయన కుమారుడు వారసత్వంగా వస్తున్న భూమి మ్యూటేషన్ కోసం ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకున్నారు. కాగా..మ్యూటేషన్ పూర్తి కావాలంటే రూ. 30 ఇవ్వాల్సిందిగా వీఆర్వో రాజు డిమాండ్ చేశారు.

దీంతో రైతులు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు. కాపు కాసిన అనిశా అధికారులు వీఆర్వో రాజు లంచం తీసుకుంటుండగా రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టినట్లు అనిశా డీఎస్పీ వెల్లడించారు.

ఇదీ చదవండి

'ఆ నోట్లపై గాంధీ బొమ్మ తీసేయండి'.. మోదీకి కాంగ్రెస్​ ఎమ్మెల్యే విజ్ఞప్తి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details