చనిపోయిన భర్త పేరిట ఉన్న భూమిని తన పేరుకు మార్చేందుకు దరఖాస్తు చేసుకున్న ఓ మహిళ వద్ద రూ.3 వేలు లంచం తీసుకున్న సర్వేయర్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. విశాఖ జిల్లా పద్మనాభం మండలంలోని ఎమ్మార్వో కార్యాలయంలో సర్వేయర్ జగన్నాథం సర్వే చేసేందుకు డబ్బులు డిమాండ్ చేశాడు.
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్వేయర్
By
Published : Nov 24, 2019, 5:49 AM IST
లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుకున్న సర్వేయర్
విశాఖ జిల్లా పద్మనాభం మండలంలోని ఎమ్మార్వో కార్యాలయంలో రూ.3 వేలు లంచం తీసుకుంటూ ఎస్ జగన్నాథం అనే సర్వేయర్ ఏసీబీకి పట్టుబడ్డారు. పద్మనాభం గ్రామానికి చెందిన మహేశ్వరి అనే మహిళ తన భర్త మృతి చెందడంతో... ఆయన పేరున ఉన్న భూమిని తన పేరుకు మార్చాల్సిందిగా తహసీల్దారు కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంది. సర్వే చేసి రిపోర్టు ఇచ్చేందుకు సర్వేయర్ రూ.5 వేలు డిమాండ్ చేసి... 3 వేలకు బేరం కుదుర్చుకున్నాడు. డబ్బులు ఇచ్చుకోలేని బాధితురాలు అనిశాను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు సాయంత్రం జగన్నాథం లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. అతన్ని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు ఏసీబీ డీఎస్పీ రంగరాజు తెలిపారు.