విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం జంగాల పాలెంలో నాగమణి అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. కొద్దిరోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్న ఆమె.. సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలి తండ్రి అప్పలనాయుడు మాకవరపాలెం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంట్లోకి వెళ్లిన నాగమణి ఎంతసేపటికీ బయటకు రాకపోవడం గమనించిన తండ్రి.. స్థానికుల సాయంతో తలుపులను పగలగొట్టాడు.
అప్పటికే ప్యాన్‌కు ఉరివేసుకున్న నాగమణి అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే ఆమెను నర్సీపట్నంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు యువతిని విశాఖపట్నంలోని కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. కానీ ఆమె అప్పటికే మృతి చెందింది. ఈ మేరకు సమాచారం అందుకున్న మాకవరపాలెం పోలీసులు.. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.