ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆన్​లైన్​ యాప్​ల్లో రుణం... ఒత్తిడి తట్టుకోలేక యువతి ఆత్మహత్య

By

Published : Nov 3, 2020, 2:29 PM IST

Updated : Nov 3, 2020, 3:17 PM IST

ఆన్​లైన్​ యాపుల్లో రుణం తీసుకొని వాటిని తీర్చే విషయంలో ఒత్తిడి తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. సకాలంలో లోన్లు చెల్లింపు చేయలేక తీవ్ర మనస్తాపంతో ఈ ఘటనకు పాల్పడినట్లు ఆమె తల్లి తెలిపారు.

ఆత్మహత్య చేసుకున్న యువతి
ఆత్మహత్య చేసుకున్న యువతి

ఒత్తిడి ఎదుర్కొలేక ఓ యువతి ఆత్మహత్య

విశాఖ గాజువాకలో విషాదం చోటు చేసుకుంది. శ్రీనగర్ సుందరయ్య కాలనీలో ఎంబిఎ విద్యార్ధిని ఎం.ఆహ్లాద(22) ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఫ్యాన్​కి ఉరి వేసుకుంది. ఆమె ఆన్​లైన్​లోని కొన్ని యాప్​ల ద్వారా లోన్లు తీసుకుంది. వాటిని చెల్లించాలంటూ ఒత్తిడి ఎదుర్కొనేది. ఈ క్రమంలో వివిధ యాప్​ల నుంచి చెల్లింపుల కోసం మెసేజ్​లు, ఫోన్​లు పెద్ద సంఖ్యలో రావడం వల్ల ఆందోళన చెందేదని ఆమె తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. సకాలంలో లోన్లు చెల్లింపు చేయలేక తీవ్ర మనస్తాపంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని తల్లి చెబుతోంది.

Last Updated : Nov 3, 2020, 3:17 PM IST

ABOUT THE AUTHOR

...view details