పోలీసులకు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేసిన యువకుడు - BirthdayBoy Food Packets Distibution To Police at chippada
లాక్డౌన్ సమయంలో తమవంతు సహాయం అందించేందుకు దాతలు పెద్దఎత్తున ముందుకు వస్తున్నారు. భౌతిక దూరం పాటిస్తూనే కొందరు తమ పుట్టిన రోజున కరోనా నియంత్రణ కోసం పాటుపడుతున్న పోలీసులకు ఆహారం అందిస్తూ తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.
![పోలీసులకు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేసిన యువకుడు A young man who delivered lunch packets to police at chippada village](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6939693-1093-6939693-1587826525237.jpg)
విశాఖ జిల్లా భీమిలి మండలం చిప్పాడ గ్రామానికి చెందిన గిడిజాల పాపారావు అనే యువకుడు... తన పుట్టిన రోజును కరోనా నియంత్రణ కోసం అహర్నిశలు పాటుపడుతున్న పోలీసులతో కలిపి జరుపుకున్నాడు. పుట్టినరోజు నాడు తోటి యువకులతో సరదాగా గడపకుండా రోడ్లపై విధులు నిర్వహిస్తున్న పోలీసులకు తనవంతు సాయంగా మధ్యాహ్న భోజనం అందించాడు. భీమిలి మండల పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు, స్వచ్ఛంద సేవకులకు, నిరాశ్రయులకు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. సుమారు మూడు వందల ఆహార ప్యాకెట్లను తన సొంత డబ్బుతో తయారు చేయించి తన మిత్రులతో కలిసి పంచిపెట్టాడు. లాక్ డౌన్ కారణంగా తినడానికి తిండి లేని నిరాశ్రయులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని యువకుడు కోరాడు.