విశాఖ జిల్లా మాకవరపాలెంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒక యువకుడు మృతి చెందాడు. కసింకోట మండలం తీడా గ్రామానికి చెందిన పట్టం వీర్రాజు దసరా ఉత్సవాలకు బంధువుల ఇంటికి వెళ్లాడు. పండగ ముగించుకొని తిరిగి వస్తుండగా మార్గంమధ్యలో ఘటన జరిగింది. వీర్రాజు మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి - makavarapalem latest news
విశాఖ జిల్లా మాకవరపాలెంలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు.
![గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి a peson killed in road accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9314254-1015-9314254-1603696740360.jpg)
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి