ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెళ్లిపీటలెక్కాల్సిన యువకుడు.. మృత్యుఒడికి చేరి - deaths in paderu news

మరో రెండు రోజుల్లో పెళ్లి... ఇళ్లంతా బంధువులతో సందడి. అంతలోనే పెళ్లి పీటలెక్కాల్సిన యువకుడు మృత్యుఒడిని చేరాడు. దుక్కి దున్నేందుకు ట్రాక్టర్​ తీసుకెళ్లిన వ్యక్తికి.. ఆ వాహనమే యమపాశమైంది. దీంతో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది. ఈ ఘటన విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో జరిగింది.

young man died
మృతి చెందిన యువకుడు

By

Published : Jun 21, 2021, 4:16 PM IST

Updated : Jun 21, 2021, 8:45 PM IST

దుక్కి దున్నేందుకు తీసుకెళ్లిన ట్రాక్టర్​ మీద పడి కిల్లో పొదలం అనే యువకుడు మరణించాడు. విశాఖ జిల్లా చింతపల్లి మండలం కొత్తపాలెం పంచాయతీ మాలివీధికి యువకుడికి మరో రెండు రోజుల్లో వివాహం జరగాల్సి ఉందనగా ఈ విషాదం జరిగింది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

బంధువుల వివరాల ప్రకారం:

కిల్లో పొదలం అనే యువకుడికి అరకు లోయకు చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. ఇప్పటికే జరగాల్సిన పెళ్లి కరోనా వల్ల జూన్ 23కి వాయిదా పడింది. రెండు రోజుల్లో వివాహం జరగాల్సి ఉండటంతో ఇళ్లంతా బంధువులతో పెళ్లి సందడి నెలకొంది. యువకుడు తన చిన్నాన్న ట్రాక్టర్​ తీసుకుని ఉదయం భూమి దున్నేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు ట్రాక్టర్​ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో అతను వాహనం కింద పడిపోయాడు. స్థానికంగా ఉన్న వారు అతన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అప్పటికే అతను మృతి చెందాడు.

రెండు రోజుల్లో పెళ్లిపీటలెక్కాల్సిన వ్యక్తి మరణించటంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. మాలివీధి గ్రామమంతా విషాద ఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న జి.మాడుగుల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి.. మృతదేహాన్ని పాడేరు ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి:suspicious death: విషాదం.. అనుమానాస్పదంగా ఇద్దరు చిన్నారుల మృతి

Last Updated : Jun 21, 2021, 8:45 PM IST

ABOUT THE AUTHOR

...view details