ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బీచ్​లో స్నానం... తృటిలో తప్పిన ప్రమాదం - corona cases in vziag

లాక్ డౌన్ కారణంగా ఎక్కడికక్కడ అన్ని మూసేశారు. బీచ్ లలోనూ రాకపోకలు నిషేధంచారు. అయినా.. విశాఖలో ఓ మహిళ బీచ్ కు వెళ్లడమే కాదు. స్నానానికి యత్నించింది. అలల ఉద్ధృతికి కొట్టుకుపోయింది.

a women missing in vizag beach and police rescue her
a women missing in vizag beach and police rescue her

By

Published : May 13, 2020, 1:48 PM IST

విశాఖ సాగరతీరంలో స్నానానికి దిగిన ఓ మహిళ.. అలల ఉద్ధృతికి కొట్టుకుపోతుండగా పోలీసులు రక్షించారు. సుభాష్ నగర్ కు చెందిన రొంగలి రమణమ్మ అనే మహిళ... బీచ్ లో మధ్యాహ్నం భర్తతో స్నానానికి దిగింది. కాసేపటికే అలల ఉద్ధృతికి పట్టు తప్పింది. సముద్రంలో కలిసిపోతుండగా... బీచ్ పెట్రోలింగ్ సిబ్బంది హుటాహుటిన చేరుకుని ఆమెను రక్షించారు.

లాక్ డౌన్ నేపథ్యంలో బీచ్ లో రాక పోకలతో పాటు సందర్శకులను కూడా ఎవర్నీ లోపలికి అనుమతించడం లేదు. అలాంటిది ఈమె ఏకంగా స్నానానికి దిగటంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడప్పుడూ ఇలా సముద్ర స్నానానికి వస్తామని... ఎప్పుడూ ఇలా జరగలేదని ఆమె పోలీసులకు తెలిపింది. పోలీసులు ఆమెను స్టేషన్ కు తరలించి వివరాలు సేకరించారు.

ABOUT THE AUTHOR

...view details